ఇబ్రహీంపట్నం: సరూర్ నగర్ డివిజన్లో నీటి కలుషితంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
సరూర్నగర్ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాలనీలో నీటి కలిసితం పై వచ్చిన ఫిర్యాదును పరిశీలించి ప్రజలకు అసౌకర్యం కలిగించిన అక్రమనీటి కనెక్షన్ గుర్తించి మూసి వేసామని తెలిపారు. పైప్ లైన్ పునరుద్ధరణకు సూచనలు ఇచ్చి తాజా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.