అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదిగవి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 43.75 లక్షల రూపాయల అంచనాతో నిర్మించిన నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనమును ప్రారంభించారు గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమైన మంత్రి మాటామంతి కలుపుతూ చదువులో మెలకువలను తెలుపుతూ విద్యార్థుల ప్రతిభా పాఠవాలపై మంత్రి ఆరా తీశారు.