ఇబ్రహీంపట్నం: కార్తీక మాసం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక : ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ అపార్ట్మెంట్లో జరిగిన కార్తీకమాస వనభోజనం మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ పాల్గొని ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకా అని అన్నారు. వనభోజనాలు మనసులను దగ్గర చేస్తాయని ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను పెంచుతాయని అన్నారు. ఇలాంటి సత్సంగాలు దానం ధర్మం సమాజానికి మేలు చేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.