మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ ఆధ్వర్యంలో: పటేల్ సెంటర్లో స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో భాగంగా మానవహారం
నంద్యాల జిల్లా నందికొట్కూరు స్వచ్ఛత మనందరి బాధ్యత అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ అన్నారు, బుధవారం పట్టణంలో స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు, అనంతరం పటేల్ సెంటర్లో మానవహారం గా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ని శ్రీమతి బేబీ నందికొట్కూరు మున్సిపాలిటీని స్వచ్ఛతరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.