గుంతకల్లు: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపికైన గుత్తికి చెందిన గంటా నరహరి
గుత్తి పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నరహరిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపికైన గంట నరహరి మాట్లాడాడు. తనపై ఎంతో నమ్మకంతో వైఎస్ జగన్ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారన్నారు. వైయస్ జగన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు. అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తానన్నారు.