గత రెండేళ్లుగా తనను తీవ్రంగా వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తాను డ్రగ్స్ తీసుకుంటున్నాడని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయంటూ దిక్కుమాలిన వార్తలు ప్రచారం చేసి తనను, తన కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట లీకుల రూపంలో నిరంతరం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ఇలా తన పరువు ప్రతిష్ఠకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు