ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు జరుగు స్థలాలను పరిశీలించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 17, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలలో తో పాటు జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల స్థలాలు బుధవారం స్థానిక పోలీసులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ మూల మలుపుల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతోపాటు ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోబోతున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలను పాటిస్తున్నామన్నారు.