పటాన్చెరు: గుమ్మడిదలలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ పరిశీలించిన ఆర్డిఓ రాజేందర్ కుమార్
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సంగారెడ్డి జిల్లా ఆర్డీవో రాజేందర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ మరియు అభ్యర్థులకు సమర్పించాల్సిన పత్రాలు గురించి వివరించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి తహసీల్దార్ పరమేశం ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.