వడ్డాది: అతి కష్టం మీద బయటకు లాగారు
బీఎన్ రోడ్డులోని బంగారుమెట్ట సమీపంలో బురదలో కూరుకుపోయిన గ్రానైటు లారీని అతి కష్టం మ
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలో గల బీఎన్ రోడ్డులోని బంగారుమెట్ట సమీపంలో బురదలో కూరుకుపోయిన గ్రానైటు లారీని అతి కష్టం మీద బయటకు లాగారు. మంగళవారం రాత్రి నుంచి బురదలో లారీ దిగబడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బుధవారం 2 జేసీబీలను రప్పించి గ్రానైట్ లోడు లారీని బయటకు లాగారు. బుచ్చయ్య పేట ఎస్ఐ ఏ.శ్రీనివాసరావు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇదే సందర్భంలో స్కూటీపై వస్తున్న ఇద్దరు బురదలో పడి గాయపడ్డారు.