అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం లోని శీర్పి గ్రామంలో శనివారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం లో వైద్యాధికారి రవికుమార్ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆరోగ్య చికిత్సల్లో భాగంగా బిపి, హెచ్ బీ పరీక్షలు నిర్వహించి, హైరిస్క్ గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ కాన్పు కావాలని, ఇంటిదగ్గర ప్రసవాలు కాకూడదని, తెలిపినారు. గర్భిణీ స్త్రీలకు వ్యాధి నిరోధక టీకాలు, రక్తపోటు, చక్కర వ్యాధిగ్రస్తులకు నెలసరి పడు మందులు ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం పై వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ K. వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.