పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓజోన్ దినోత్సవం
పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సాయంత్రం ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి ఓజోన్ పొర ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అతినీలలోహిత కిరణాల నుంచి ఓజోన్ పొర రక్షణ కల్పిస్తుందన్నారు. పర్యావరణ స్థిరత్వం కోసం ఓజోన్ పొర ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కాలుష్యం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు కృషి చేయాలన్నారు.