రాయదుర్గం: మెచ్చిరి గ్రామంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కర్నాటక యువతి
రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో కర్నాటక యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మెలకల్మూరు తాలూకా బొమ్మలింగనపల్లి గ్రామానికి చెందిన ఆశా(17) అనే యువతి ఫస్ట్ ఇయర్ పియూసి చదువుతోంది. నాలుగు రోజుల క్రితం తండ్రి మల్లికార్జున, తల్లి నిర్మలతో కలసి అమ్మమ్మ ఊరైన మెచ్చిరి కి వచ్చి మేనమామ తిప్పేస్వామి ఇంటిలో ఉంటున్నారు. బుధవారం మద్యాహ్నం అందరూ పొలంలో ఉండగా ఇంట్లో ఆ యువతి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కూతురు మృతుచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.