ఏజెన్సీలో కార్వాన్ పార్క్ ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
ఏజెన్సీలో కార్వాన్ పార్క్‌ల ఏర్పాటుకు ఐదు స్థలాలు గుర్తించామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లో మూడు, రంపచోడవరంలో రెండు స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. బుధవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని కలెక్టరేట్లో ఐదు మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో కార్వాన్ టూరిజం ఏర్పాట్లపై కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీటీడీసీ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలన్నారు.