విశ్వకర్మ సేవలు అందరికీ ఆదర్శనీయం: అనకాపల్లి జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి
విరాట్ విశ్వకర్మ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి అన్నారు. బుధవారం నాడు అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ.. సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని,సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు.