హిమాయత్ నగర్: యూసఫ్ గూడా సవేరా ఫంక్షన్ హాల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మాగంటి సునీత నిరసన
యూసఫ్ గూడా సవేరా ఫంక్షన్ హాల్ వద్ద మాగంటి సునీత గోపీనాథ్ మంగళవారం మధ్యాహ్నం ఓటర్లను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఆటోలో ఎక్కిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను చంపేస్తారా అంటూ ఆమె ఆవేదనకు గురయ్యారు. ఓటర్లను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.