భూపాలపల్లి: ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా ప్రజా పాలన దినోత్సవం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారుఎమ్మెల్యే గండ్ర.ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిందని మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.