ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో ఓట్లు వేయాలని చూస్తుంది: మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేసి, దొంగ ఓట్లు వేయాలని చూస్తోందని మాజీ మంత్రి హరీశ్రవు అన్నారు. వీడియో ఆధారాలతో ఎన్నికల ప్రధాన అధికారికి చూపించి, వారి ఫోన్కు కూడా పంపించామని, ఇన్ని దొంగ ఓటర్ ఐడీ కార్డులు కుప్పలుగా కనిపిస్తుంటే ఎన్నికల అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.