నారాయణపేట్: వికలాంగుల సంక్షేమ శాఖ జీవో 34 ను అమలు చేయాలి: ఎన్పిఆర్డి డిమాండ్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని వివేకానంద మున్సిపల్ పార్కు ముందర NPRDజిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో 34 అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.NPRDజిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాధ,కే.కాశప్ప మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని అన్నారు.