కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు ప్రకటించిన కనీస మద్దతు ధర కు (MSP) తగ్గకుండా, ట్రేడర్లు మొక్కజొన్నను కొనుగోలు చేసి, రైతులు నష్టపోకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ పంటలకు మార్కెటింగ్ చేసే అంశం పై జిల్లా కలెక్టర్ ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కజొన్నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 కనీస మద్దతు ధరను నిర్ణయించిందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్నను ఈ ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ట్రేడర్లను ఆదేశించారు