కొండపి: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామిని కలిసిన ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామిని మంగళవారం ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి లోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజబాబు కలిసి పుష్పగుచ్చ అందించారు. తర్వాత జిల్లాలోని పలు సమస్యలపై ఇరువురు చర్చించారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి మంత్రి స్వామితో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకరించాలని కలెక్టర్ రాజాబాబు వారికి విజ్ఞప్తి చేశారు.