ప్రకాశం జిల్లా ముండ్లమూరు లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తు కు బంగారు బాటలు వేయవచ్చన్నారు. కూటమి పాలనలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా వసతులు భోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.