రాయదుర్గం: బస్సుల కోసం బొమ్మనహాల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు, స్థంభించిన ట్రాఫిక్
బొమ్మనహళ్ జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని రోడ్డుపై బైటాయించారు. కనేకల్ బళ్లారి ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం 2 గంటల పాటు నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకుని డిపో రాయదుర్గం, కళ్యాణదుర్గం మేనేజర్లతో మాట్లాడి బస్సులు వచాచేలా చూస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింప చేశారు.