అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఆవులెన్న గ్రామానికి చెందిన వన్నూరు స్వామి (44) పలు అనారోగ్య సమస్యలు తాళలేక గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య రామాంజినమ్మ మధ్యాహ్నం రెండు గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యానికి బానిసైన తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర కడుపునొప్పితో నిత్యం బాధపడుతుందేవాడని కలిపి నొప్పి తాళ లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులు పేర్కొంది. మృతునికి భారత పాటు కూతురు పూజిత, తల్లి మారెక్క ఉన్నారు. ఘటనపై బెళుగుప్ప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.