రాజానగరం: ఈనెల 19న చలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు ఓటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఛలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఆందోళనకు పిలుపు ఇచ్చినట్టు తెలిపారు.వైఎస్సార్ సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం సంయుక్తంగా ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలన్నారు. మెడికల్ కళాశాలలో పిపిపి విధానాన్ని అందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.