రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కుందుర్పి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం నెలకొల్పడానికి పేటీయం సమావేశం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. బాగా కష్టపడి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.