వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు
బాలయపల్లి మండలంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు రెండు రోజులుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. BNS168 సెక్షన్ ప్రకారం సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పేరు, మొబైల్ నంబర్స్, గ్రూప్ సభ్యుల సంఖ్య, గ్రూప్ దేని కోసం వాడుతున్నారు? అనే వివరాలను పోలీసు స్టేషన్లో అందజేయాలంటున్నారు. గ్రూపులో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ బాధ్యత అడ్మిన్లదేనని నోటిసుల్లో స్పష్టం చేస్తున్నారు.