సంగారెడ్డి: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రీవిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ల సూచించారు. బి ఎల్ వో లు బి ఎల్ ఓ సూపర్వైజర్లు సమన్వయంతో యాప్ ల ద్వారా కేటగిరీలను నిర్ణయించి అనుసంధానం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు పాల్గొన్నారు.