అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండ గ్రామం శివారులో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి బోల్తా పడి జే.రవి(29) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుత్తి మండలం కె.ఊచిచెర్లకు చెందిన రవి పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆదివారం తన చిన్న కుమారుడు పవన్ కుమార్ బర్త్ డే ఉండటంతో శనివారం రాత్రి కేక్ కొనేందుకు గుత్తి పట్టణానికి వెళ్ళాడు. అన్ని వస్తువులు కొని కె.ఊబిచెర్లకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.