నారాయణపేట్: ముడుగుల మల్లయ్య తండాకు రేషన్ డీలర్ ను నియమించాలి
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ముడుగుల మల్లయ్య తండా గ్రామానికి రేషన్ డీలర్ ను నియమించాలని గిరిజనులు కోరుచున్నారు. సంవత్సరం కాలంగా రేషన్ డీలర్ లేకపోవడంతో మడుగు తండా చీరల నర్సయ్య తండా గిరిజన తండా గ్రామాలలోని గిరిజనులు రేషన్ సర్కుల కోసం ధన్వాడ మండలంలోని రామకృష్ణయ్య పల్లి గ్రామానికి వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న రేషన్ డీలర్ కు ప్రభుత్వ ఉద్యోగం రావటంతో ఆ యొక్క పోస్ట్ ఖాళీగా ఉందని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన ఇదివరకు రేషన్ డీలర్ ను నియమించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైన సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డీలర్ ను ఏర్పాటు చేయాలని కోరుచున్నారు.