పటాన్చెరు: పలుగు మీది నల్ల పోచమ్మ ఆలయం వెళ్లే రహదారి మరమ్మతులు చేపట్టండి : మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ
జిన్నారం మండల శివారులోని హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామం నుండి పలుగు మీది నల్ల పోచమ్మ ఆలయం మరియు జిన్నారం లింక్ రోడ్డు నర్సాపూర్ వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిందని మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్థం మరియు నరసాపూర్ వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.