చింతల మానేపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయం 8 ఏళ్లుగా శాశ్వత భవనం లేక శిధిలవస్తులో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగుతుంది. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు భవన పరిస్థితి చూసి ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్నందున వెంటనే నూతన భవనాన్ని నిర్మించి సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు,