హయత్ నగర్ డివిజన్ లోని పద్మావతి కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ మరమత్తులను జలమండలి అధికారులతో కలిసి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచుగా భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ మ్యాన్ హోల్స్ ధ్వంసం కావడం వల్ల డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందువల్ల వీలైనంత త్వరగా మరమ్మత్తులను పూర్తి చేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు.