ఇబ్రహీంపట్నం: ప్రజల సౌకర్యాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో 30 లక్షల నిధులతో సిసి రోడ్లు 5 లక్షల నిధులతో స్ట్రీట్ లైట్స్ కు ఎమ్మెల్యే కాలు యాదయ్య సోమవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు గ్రామాలు పట్టణాలలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. రోడ్లు డ్రైన్లు వీధిలైటు వంటి సదుపాయాలు ప్రతివాడలో అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.