అన్నమయ్య జిల్లాలో చిరుధాన్యాలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లాలో చిరుధాన్యాలు, ఉద్యాన పంటల అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిన్న నీటిపారుదల ట్యాంకుల పునరుద్ధరణ, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల అందుబాటు, ఆరోగ్య–విద్య రంగాల అభివృద్ధి వంటి అంశాలపై కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.