నిజామాబాద్ సౌత్: కలెక్టరేట్ లో ఘనంగా భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం
భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ఐడిఓసి కార్యాలయం నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై, భగవాన్ శ్రీ విశ్వకర్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.నర్సయ్య, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గంగాధర్, విశ్వకర్మ కులాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది.