కొత్తగూడెం: సుజాత నగర్ లో సీపీఎం ఆధ్వర్యంలో వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ,ర్యాలీ..
సుజాతనగర్ మండలం సుజాతనగర్ లో తెలంగాణా విలీన దినోత్సవం సందర్భంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈసందర్భంగా సుజాతనగర్ సెంటర్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..... ఎన్నో ఏళ్ళ చరిత్ర గలిగిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా తెలంగాణా విలీన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.