గుంతకల్లు: ఊబిచర్ల గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం, వ్యక్తికి తీవ్ర గాయాలు
గుత్తి మండలం ఊబి చర్ల గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి బైక్ లో బెంగళూరు బయలుదేరాడు. మార్గమధ్యలో బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొనింది. ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్ లో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.