పొన్నూరు: చేబ్రోలులో వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో బుధవారం వీధి కుక్కలు దాడి చేయడంతో వరికూటి ధనుష్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరిగిందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.