వికారాబాద్: పోరాట యోధులను స్మరించుకోవాలి : కలెక్టర్ ప్రతిక్ జైన్
తెలంగాణ విముక్తి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణకు స్వతంత్రం రాలేదన్నారు. ఎందరో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణకు కల్పించాలని వారి పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.