ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఎలక్ట్రికల్ షాపులో ఇటీవల రూ.510 నగదును చోరీ చేసిన ఓ దొంగను శనివారం కంభం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంవత్సరం రెండో నెలలో నర్సిరెడ్డిపల్లి లోని పోలేరమ్మ గుడిలో 50 గ్రాముల వెండి కిరీటాన్ని కూడా ఇప్పుడు పట్టు పడ్డ దొంగ చోరీ చేసినట్లు ఎస్ఐ నరసింహారావు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టుల ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.