ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన ఎస్సీ ఎస్టీ మోనిటరింగ్ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి వారి సమస్యలపై పరితర అంశాలపై జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొని సమస్యలపై చర్చించారు.