పలమనేరు: గంగవరం: ఫ్లై ఓవర్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్ ఢీకొన్న మరో కంటైనర్, విరిగిన కరెంటు స్తంభం డ్రైవర్ కు గాయాలు
గంగవరం: మండల కేంద్రం ఫ్లైఓవర్ వద్ద కంటైనర్ డ్రైవర్ కుమార్ తెలిపిన సమాచారం మేరకు. ముందు వెళ్తున్న కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుండి ఢీకొట్టగా ముందు వెళ్తున్న కంటైనర్ విద్యుత్ ఫోల్ ను ఢీ కొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఓ డ్రైవర్ కు గాయాలు కాగా పలమనేరు ఏరియా ఆసుపత్రికి వైద్యం కొరకు తరలించడం జరిగిందన్నారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.