నిజామాబాద్ సౌత్: ఘనంగా ప్రజా పాలన దినోత్సవం సంబరాలు: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి
నిజామాబాద్ కలెక్టర్లు లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఆయన, జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజాపాలన దినోత్సవం వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బాలికలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.