భూపాలపల్లి: గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొండయ్యను పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని కేటీకే శిక్సింగ్ లైన్ గనిలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు మొండయ్యను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి మంగళవారం సాయంత్రం 6:50 గంటల సమయంలో పరామర్శించారు మెరుగైన వైద్యం ఆయనకు అందించాలని సింగరేణి యాజమాన్యంతో పాటు ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయన వెంట పలువురు బి ఆర్ ఎస్ శ్రేణులు ఉన్నారు.