జి జి హెచ్ లో పారిశుద్ధ్యం లో లోపాలను వారం లోపు పూర్తి స్థాయి లో సరిదిద్దాలని, ఎం ఓ యూ ప్రకారం అన్ని రకాల సదుపాయాలు సమకూర్చుకోవాలని డి ఆర్వో ఓబులేసు శానిటేషన్ ఏజెన్సీ వారిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిజిహెచ్ లో పారిశుధ్యం, మరియు మౌలిక సదుపాయాల పై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులైన డి ఆర్వో, జి జి హెచ్ సూపరెంటెండెట్ జిల్లా వైద్య అధికారి, మునిసిపల్, ఏపీఎంసీడీసీ , అధికారులతో కూడిన కమిటీ జి జి హెచ్ సూపరెంటెండెంట్ ఛాంబర్ లో సమావేశమైనది. ఈ నెల 24 న తొలి సారి కమిటీ జి జి హెచ్ లో పరిశీలన చేసింది.