ఇబ్రహీంపట్నం: గడ్డి అన్నారం డివిజన్లో ఇల్లు కూలిపోయిన ఘటనను పరిశీలించిన కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
గడ్డి అన్నారం డివిజన్లోని నేతాజీ నగర్ లో పాత నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అధికారులతో కలిసి ఆదివారం ఉదయం చేరుకొని ఘటనను పరిశీలించి ప్రమాదకరంగా నిలిచిన శిధిలాలను పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణా నష్టం జరగకపోవడం అత్యంత సంతోషకరమని అన్నారు. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.