సంగారెడ్డి: ఓడిఎఫ్ కు 1119 కోట్ల ఆర్డర్ మంజూరు: సమావేశంలో వివరాలు వెల్లడించిన మెదక్ ఎంపీ
కంది మండలం ఎద్దు మైలారం పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 1119 కోట్ల రూపాయల డిఫెన్స్ ఆర్డర్ మంజూరైనట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం రాత్రి ఓడిఎఫ్ లో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్డర్ మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో జగన్, సంగమేశ్వర్, నర్సింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రవిశంకర్, హనుమంత్ రెడ్డితో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.