తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని గాంధీ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిన బిజెపి నేతలు
తాడిపత్రిలో బీజేపీ నేతలు బుధవారం సేవా పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ సర్కిల్ పరిసర ప్రాంతాలలో స్వచ్ఛభారత్ చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. బీజేపీ రాష్ట్రలీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు.