శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ పర్యటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కదిరికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పలేదని, ఆయనతో కదిరికి ఒరిగిందేమీ లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైయస్ఆర్సీపీ దేనని తెలియజేశారు.