కామారెడ్డి: యోగా ఛాంపియన్షిప్ లో రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పట్టణంలో అభినందించిన : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఇటీవల నిర్మల్ పట్టణంలో జరిగిన ఆరవ రాష్ట్ర స్థాయి యోగ చాంపియన్షిప్ పోటీలలో కామారెడ్డి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. 12 గోల్డ్ మెడల్స్, మూడు సిల్వర్ మెడల్స్, నాలుగు బ్రాండ్ మెడల్స్, మొత్తం 19 మెడల్స్ పథకాలు సాధించి రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ ట్రోఫీలో మొదటిసారిగా సాధించి నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కి ఎన్నికైన సందర్భంగా వారిని కలెక్టర్ అభినందించారు. ఇదే విధంగా పట్టుదలతో శ్రమించి పథకాలు సాధించాలని కోరారు.